Andhra
మార్కాపురం లాడ్జీలలో తనిఖీ చేసిన పోలీసులు.. పేకాట ఆడుతున్న ఐదుగురి అరెస్టు, 27,050/- స్వాధీనం
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం డీఎస్సీ సూచనల మేరకు సీఐ పి సుబ్బారావు మరియు పట్టణ ఎస్ఐ ఎమ్ సైదుబాబు నేతృత్వంలో మార్కాపురం పట్టణంలోని పలు లాడ్జీలను చెకింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని స్టార్ ప్రైమ్ లాడ్జిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి, వారి దగ్గర నుంచి 27,050/- రూపాయలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లాడ్జిలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటు కల్పించవద్దని నిర్వాహకులను హెచ్చరించారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
![]()
