Andhra
మార్కాపురంలో ఉర్దూ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చెయ్యాలి..ఎస్టియు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉండి, ఎక్కువ మంది విద్యార్థులు ఉర్దూ నేర్చుకోవాలని కుతూహలం ఎక్కువగా ఉందని, జిల్లా పరిషత్ బాలికలు మరియు బాలురు హైస్కూల్లలో 150 విద్యార్థులు పైగా ఉర్దూ మాధ్యమం నేర్చుకుంటున్నందున, వీరికి ఒక ప్రత్యేక పాఠశాలను ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ఏర్పాటు చేయాలని ఎస్టియు జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వాన్ని కోరారు. ఎస్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండో రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు మరియు బాలికల నందు ఈరోజు నిర్వహిస్తూ.. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఉర్దూ పాఠశాల కావాలని జడ్పిబిహెచ్ ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు పట్టణ శాఖ అధ్యక్షులు కే ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు.
![]()
