Andhra
కూటమి ప్రభుత్వం, వైసిపిలు ఏపి ప్రజలను మోసం చేయడం మాని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలలు ఏర్పాటు చెయ్యాలి..MPJ
గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అవసరాలకు 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేయడం, వాటిలో ఐదు సంవత్సరాల కాలంలో ఐదింటిని పూర్తి చేసి ప్రారంభించినందుకు ప్రజలు సంతోషించారు. అయితే గత వైసిపి.. ప్రభుత్వం తరపున చేపట్టాల్సిన మెడికల్ కళాశాలలను ప్రభుత్వం- ప్రైవేటు- పబ్లిక్ భాగస్వామ్యంతో చేపట్టడాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు, మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఆధ్వర్యంలో కళాశాలలను ఏర్పాటు చేస్తామని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి, తమ నాయకులకు ఆర్ధికంగా లబ్ది పొందేందుకు మళ్లీ PPP విధానం ద్వారానే కళాశాలలను ఏర్పాటు చేస్తామని చెప్పడం పూర్తిగా ప్రజలను మోసం చేయడమే అని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ ప్రభుత్వ విధానాన్ని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైయస్సార్ పార్టీలు రాజకీయాలు చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించడం మాని రాష్ట్ర ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వ నిర్వహణలోనే మెడికల్ కళాశాలలను ఏర్పాటు చెయ్యాలని, లేదంటే ప్రజల ఆగ్రహాన్ని చూసెందుకు సిద్ధంగా ఉండాలని అబ్దుల్ రజాక్ అన్నారు.
![]()
