Andhra
మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని వైసిపి నిరసన.. భారీగా తరలి వచ్చిన శ్రేణులు
మార్కాపురం: రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ పశ్చిమ ప్రకాశం లోని ఐదు నియోజకవర్గాల నుంచి వైసిపి శ్రేణులు “చలో మార్కాపురం” నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి నాయకులు మాట్లాడుతూ.. గత వైసిపి ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసెందుకు ప్రయత్నం చేశామని, అందులో భాగంగా కొన్ని కళాశాలలను పూర్తి చేశామని, మరి కొన్ని 50 శాతం పూర్తి చేశామని, అయితే కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను పిపిపి పద్దతిలో ప్రైవేటు పరం చేస్తూ తమ నాయకులకు ఆర్ధికంగా లబ్ది చేకూర్చే ప్రయత్నం చెయ్యడం దారుణమని, దీంతో పేద ప్రజలకు మెడికల్ సదుపాయం పొందటం ఖరీదుగా మారుతుందని, కాబట్టి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలలను ఏర్పాటు చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకాయమ్మ, వైసిపి జిల్లా అద్యక్షులు.. దర్శి ఎమ్మెల్యే బూచెపల్లి శివ ప్రసాద్ రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్, మార్కాపురం ఇంఛార్జి.. గిద్దలూరు మాజి ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు, గిద్దలూరు ఇంఛార్జి.. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, కనిగిరి వైసిపి ఇంఛార్జి దద్దాల నారాయణ యాదవ్ మరియు ఐదు నియోజక వర్గాల వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
![]()
