Andhra
ప్రమాదకరమైన గుంతలను వెంటనే పూడ్చాలి: ఎంపీజే గుంటూరు
యంపీజే రాష్ట్ర పిలుపు మేరకు స్థానిక సమస్యలు – వాటి పరిష్కారాలు సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జరుగుతున్న ఉద్యమంలో భాగంగా గుంటూరులోని 39వ వార్డును ఎంపీజే బృంద సభ్యులు పర్యటించడం జరిగింది. ఈ వార్డులో ప్రధానమైన రోడ్డు పలకలూరు రోడ్డులో వర్షానికి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటం చూసి అధికారులు వెంటనే ఈ గుంతలను పూడ్చాలని తెలియజేయడం జరిగింది.స్థానికులు మాట్లాడుతూ వార్డులో రోడ్లులో గుంతలు, డ్రైనేజీ కాలువలు,కుక్కల బెడద, దోమలు విపరీతంగా పెరిగి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా యంపీజే స్థానిక సమస్యలను గుర్తించి సంభందిత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా, పట్టణ అధ్యక్షులు షేక్ సుభాని, షేక్ హుస్సేన్, షేక్ బుడే తదితరులు పాల్గొన్నారు.
![]()
