Andhra
ర్యాగింగ్ పై అవగాహన కల్పించిన పోలీసులు..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డాక్టర్ సామ్యూల్ జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలోని విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ పై నిర్వహించిన అవగాహన సదస్సులో మార్కాపురం సబ్ డివిజనల్ ఆఫీసర్ డాక్టర్ యు. నాగరాజు మరియు మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి .సుబ్బారావు, సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ ఎం. రాజా మోహన్ రావులు పాల్గొని విద్యార్థులకు ర్యాగింగ్ చట్టాల పైన అవగాహన కల్పించి, విద్యార్థులు ర్యాగింగ్ చేయడం వల్ల కలిగే నష్టాలు తెలియజేసి, అందరూ సామరస్యంగా కలిసిమెలిసి ముందుకెళ్లాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
![]()
