Connect with us

Andhra

గాంధీ పార్క్ ఘటనపై సోషల్ మీడియాలో వ్యాప్తి చెందేది తప్పుడు ప్రచారం.. పోలీసుల ఖండన

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద జరిగిన సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో అవాస్తవ మరియు నిరాధారమైన సమాచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.

సామాజిక మాధ్యమాల్లో గాంధీ పార్కులో గంజాయి సేవించి యువకులు బీభత్సం సృష్టించారనే ప్రచారం జరుగుతుండగా, ఇది పూర్తిగా అసత్యం మరియు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం మాత్రమే అని పోలీసులు స్పష్టం చేశారు.

షేక్ మహబూబ్ సుభాని అనే వ్యక్తి తన తండ్రి బాబుతో కలిసి మద్యం సేవించి పార్క్‌లో కూర్చుని ఉన్నప్పుడు, నాగరాజు అనే వ్యక్తి అక్కడికి వచ్చి వారిద్దరితో అసభ్యంగా ప్రవర్తించడఃతో.. ఆగ్రహంతో మహబూబ్ సుభాని, నాగరాజుతో ఘర్షణకు దిగాడని తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే మార్కాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని, చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరిగిందని, ఈ ఘర్షణ వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని, ఎలాంటి గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల వినియోగం జరగలేదని విచారణలో స్పష్టమైందని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఒంగోలు వారు మీడియాకు తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.