Andhra
తురకపాలెంలో పర్యటించిన గుంటూరు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా…
గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో ఈమధ్య కాలంలో దాదాపు ఆరునెలల కాలంలో 30 మంది చనిపోయినందున రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు ఆ గ్రామం వైపు ఆకర్షించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొత్తగా గుంటూరు జిల్లా కలెక్టర్ గా భాద్యతలు చేపట్టిన తమీమ్ అన్సారీయా వెంటనే తురకపాలెం పర్యటించి తాగునీటి, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. వైద్య శిబిరాన్ని తనిఖీ చేసి, గ్రామస్తులకు శుభ్రతపై అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. గ్రామస్తులు జూన్, జూలైలలో నీటి కొరత వస్తుందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయతీ, వైద్య శాఖల అధికారులు పాల్గొన్నారు.
![]()
