Connect with us

Andhra

భార్యను బెల్టుతో చావబాదిన భర్త.. కేసును విచారణ చేపట్టిన పోలీసులు..

Published

on

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో భార్య తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భర్త గురునాథం బాలాజీ భార్యను కట్టేసి బెల్టుతో చావబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి పోయింది. ఈ ఘటనపై స్పందించిన దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, పొదిలి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ బ్రహ్మనాయుడులు మంగళవారం రాత్రి ఘటన స్థలానికి చేరుకొని బాధితురాలి కుటుంబ సభ్యులను విచారించారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన భర్త గురునాథం బాలాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అదేవిధంగా పలువురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం భర్త చేత గాయపడిన బాధితురాలు భాగ్యమ్మను మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్సను అందిస్తున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.