Andhra
మండల స్థాయిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు.. కంభం MEO అబ్దుల్ సత్తార్
కంభం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలను నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా కంభం మండల విద్యాశాఖాధికారి అబ్దుల్ సత్తార్ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని పీడీలతో సమావేశమై క్రీడా మైదానంలోని ఏర్పాట్లను పరిశీలించారు. అండర్ 14, అండర్ 17 బాలబాలికలకు కబడ్డీ, కోకో, బ్యాడ్మింటన్, యోగా, చెస్ మరియు అథ్లెటిక్స్ విభాగాల్లో మండల స్థాయి పోటీలను నిర్వహించనున్నట్లు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలలో మండలంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుండి విద్యార్థులు హాజరు కావాలన్నారు. మండల స్థాయి పోటీల్లో విజేతలైన క్రీడాకారులు డివిజనల్ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని ఆయన తెలిపారు.
![]()
