Connect with us

Andhra

*బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21 వ తేదీ నుండి ఉచిత కెరీర్ గైడెన్స్ సెంటర్ ప్రారంభం*

Published

on

ఉద్యోగాల కోసం రోజు ఎన్నో నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి అయినా సరైన నైపుణ్యం లేక ఎన్నో పోస్టులు అలాగే ఉండిపోతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ నైపుణ్యాలను అందించాలని బ్రైట్ హారిజాన్ ఫౌండేషన్ సంస్థ నిర్ణయించుకుంది. ఈ ప్రాజెక్టునుఅత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉద్యోగాల కల్పన కోసం బాట వేయనున్నావని సంస్థ చైర్మన్ ఎం.కె.ఎస్. మొహియుద్దీన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలలో ఎవరు నిర్వహించని విధంగా కెరీర్ గైడెన్స్ సెంటర్ నిర్వహించబోతున్నారు.వచ్చినా అవకాశాన్ని పేదలు, ముస్లిం నిరుద్యోగులందరూ వినియోగించుకొని పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కెరీర్ గైడెన్స్ సెంటర్ ప్రారంభ కార్యక్రమం 21.09.2025 (ఆదివారం), మధ్యాహ్నం 3.00 గంటలకు గుంటూరులోని నందివెలుగు రోడ్‌లోని BHF కార్యాలయంలో *BHF ఉచిత కెరీర్ గైడెన్స్ సెంటర్ ప్రారంభం కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని బ్రైట్ హారిజాన్ ఫౌండేషన్ సంస్థ కోరుతుంది అని ఆయన తెలియజేశారు.

*ప్రారంభ కార్యక్రమం తేదీ*: 21.09.2025

*సమయం*: మధ్యాహ్నం 3.00 (కార్యక్రమం మధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 5.00 వరకు)

*వేదిక*: BHF కార్యాలయం, 54-122/3, 5వ లైన్, అబ్దుల్ కలాం నగర్, నందివెలుగు రోడ్, గుంటూరు-522002, ఫోన్: 80194 79927,9652182883

 

పూర్తి వివరాలకు

ఎం.కె.ఎస్. మొహియుద్దీన్

చైర్మన్,బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్.

www.brighthorizonsindia.org

mksbhf@gmail.com

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.