Andhra
పేదల పాలిట శాపంగా మారిన ఇసుక దందాను అరికట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ కేంద్రంలో కూటమి నేతలు ఇసుక దందా చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు సోమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పాత బస్టాండ్‌లో భవన నిర్మాణ కార్మికులతో ధర్నా నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఉచిత ఇసుక హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు లారీ యజమానులను బెదిరించి టన్ను 800 రూపాయలకు కొనుగోలు చేసి, 13,50 రూపాయలకి అమ్ముతూ..పేదల నోర్లూ కొట్టి కోట్లు సంపాదిస్తున్నారని, పేదలు గృహ నిర్మాణం చేపట్టాలంటే ఇసుక అధిక ధరలకు భయపడి నిర్మాణం ఆపేశారని, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేని ఇసుక దందా మార్కాపురం నియోజకవర్గంలో విపరీతంగా ఉందని విమర్శించారు. ఇసుక కొరత, అక్రమ దందా తక్షణం ఆపి ప్రజలకు ఉచిత ఇసుక ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు డికేయం రపి, గుమ్మ బాల నాగయ్య, రూబెన్, రాజు మరియు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
![]()
