Andhra
కట్న కానుగల ప్రస్తావన లేకుండా పెళ్లి చేసుకున్న SIO యువకుడు నశీర్ అహ్మద్
SHOT NEWS: కట్నం కోసం ఆడపిల్ల వారిని రాచి రంపాన కొడుతున్న వారు కొందరైతే, ఇస్లాం స్ఫూర్తితో కట్న కానుకలు ప్రస్తావన లేకుండా పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు యువకులు.అలాంటి పెళ్లి ఒకటి ఈరోజు పిడుగురాళ్లలో మసీదులో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఘనంగా జరిగింది.స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కు చెందిన ఎస్ ఐ ఓ యువకుడు షేక్ నశీర్ అహ్మద్ కట్న కానుకల ప్రస్తావన లేకుండా పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచారు.ఆడపిల్ల తల్లిదండ్రులకు ఎలాంటి నిబంధనలు పెట్టకుండా పెళ్లి చేసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పెళ్లి చేసుకున్న నసీర్ అహ్మద్ కు ఎస్ ఐ ఓ యువకులు, జమాత్ సభ్యులు, తోటి మిత్రులు ఆయనను అభినందించి ఆయన పెళ్లిలో శుభాలు కలగాలని దైవంతో దువా చేశారు.
![]()
