Andhra
MPJ రాయలసీమ ప్రాంతీయ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ..
ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో యంపీజే రాయలసీమ ప్రాంతీయ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ స్థానిక జిల్లా సెంటర్ లోని యంపీజే కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంపీజే ఏపి రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ విచ్చేసి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతాల వారీగా యంపిజే ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తూ.. కోస్తాంధ్ర ప్రాంతీయ సభ గుంటూరులో, ఉత్తరాంధ్ర ప్రాంతీయ సభ కాకినాడలో విజయవంతంగా ముగిశాయని, ఇప్పుడు అక్టోబర్ 11 శనివారం ప్రొద్దుటూరులో రాయలసీమ యంపీజే ప్రాంతీయ సభ జరగనుందని, ఇందులో రాయలసీమ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలు, అలాగే నిరుద్యోగం, విద్యా, మహిళల సమస్యలు, మతోన్మాదం, బలహీనులకు న్యాయం, ప్రజలకు చేరువగా సంక్షేమ పథకాలు తదితర అంశాలపై . సమావేశంలో చర్చించడం జరుగుతుందని, కావున అందరూ ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో యంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, యంపీజే రాయలసీమ కన్వీనర్ షేక్ అయ్యూబ్, కడప జిల్లా అధ్యక్షుడు షేక్ జాకీర్ ఉమ్రీ, ప్రొద్దుటూర్ పట్టణ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ బాషా, ప్రొద్దుటూరు పట్టణ కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
