Andhra
ఎరువుల షాప్ పై ఆకస్మిక తనిఖీలు చేసిన ఏడిఏ బాలాజీ నాయక్
మార్కాపురం: వ్యవసాయ అధికారి ఏ డి ఏ బాలాజీ నాయక్ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సుధా ఏజెన్సీ షాపుకు అకస్మాత్తుగా వెళ్లి తనిఖీ చేశారు. ఈ తనిఖీలు పురుగు మందు షాపులను పరిశీలించి అక్కడున్న రిజిస్టర్లు, బిల్లు బుక్కులను పరిశీలించారు. మూడు పురుగుమందులను తీసుకొని ల్యాబ్ కి పంపించడం జరిగింది. ఏమైనా నకిలీ మందులు గాని అమ్మితే తక్షణమే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో టెక్నికల్ ఏవో ప్రసన్న రంగా లక్ష్మి, మార్కాపురం మండల వ్యవసాయ అధికారిని కె బుజ్జి బాయి, తర్లుపాడు మండల వ్యవసాయ అధికారిని జోష్ణ దేవిలు పాల్గొన్నారు.
![]()
