Andhra
పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి: సుప్రీంకోర్టు
నేపాల్, బంగ్లాలో నిరసనలతో ప్రభుత్వాలు కూలిపోవడంపై సుప్రీంకోర్టు స్పందించింది. ‘మన రాజ్యాంగం పట్ల గర్వంగా ఉంది. పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి. నేపాల్ పరిస్థితి చూడొచ్చు’ అని చీఫ్ జస్టిస్ BR గవాయ్ అన్నారు. బంగ్లాలోనూ ఇదే జరిగిందని జస్టిస్ విక్రమ్నాథ్ గుర్తుచేశారు. రాష్ట్ర బిల్లులపై నిర్ణయానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించాలన్న పిటిషన్పై వాదనల సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
![]()
