Connect with us

Andhra

ఆటోడ్రైవర్ లకు 15 వేలు ఇస్తాం.. సీఎం చంద్రబాబు

Published

on

అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో ఆటోవాల్లకు ఒక శుభవార్త చెప్పారు. దసరా రోజున వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించి ఒక్కో ఆటోడ్రైవర్ కు 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు సభా వేదికగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం అమలు తర్వాత ఆటో డ్రైవర్లు తమకు ఇబ్బంది కలుగుతుందని, తమకు జీవనోపాధి కరువవుతున్నదని పెద్ద ఎత్తున ఆందోళనల చేపడుతున్న నేపథ్యంలో.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఒక్కో ఆటో డ్రైవర్ కు 15000 రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని, ప్రజల జీవన ప్రమాణం పెరగాలని చంద్రబాబు వ్యక్తం చేశారు. ఏపీలో సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చి మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్న ఆయన తమ ప్రభుత్వం జవాబుదారీ గల ప్రభుత్వమని, బాధ్యతతో పని చేస్తున్న ప్రభుత్వం అని అన్నారు. ఎన్ని కష్టాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.