Connect with us

Andhra

పట్టణ టిడిపి మైనారిటీ అధ్యక్షుడుగా జాబీర్ హుస్సేన్ బేగ్..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం టిడిపి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షునిగా మొగల్ జాబీర్ హుస్సేన్ బేగ్ ను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నియమించారు. జాబీర్ఈ బేగ్ ప్రస్తుతం MHPS పట్టణ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా జాబిర్ హుస్సేన్ బేగ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో తనకు కల్పించిన ఈ బాధ్యతను పార్టీ అభివృద్ధికి క్రమశిక్షణతో నిర్వర్తిస్తానని, అలాగే తనకు ఈ అవకాశం కల్పించిన టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్ కి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి, టిడిపి నాయకులు కందుల రామిరెడ్డి, పట్టణ అధ్యక్షులు పఠాన్ ఇబ్రహీంకి మరియు ఇతర టిడిపి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కమిటీలో పట్టణ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులుగా చిన్న కాసింసాహెబ్, షేక్ ఖాసిం వలి, జనరల్ సెక్రటరీగా షేక్ ఖాసిం సాహెబ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా అబ్దుల్ కరీం భాష, షేక్ షఫీ, షేక్ నాగుర్ వలి సెక్రటరీలుగా షేక్ దీనావలి, సయ్యద్ మౌలాలి మరియు షేక్ మస్తాన్ వలీలను నియమించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.