Andhra
పెరిగిన ఉష్ణోగ్రతలతో మార్కాపురం డివిజన్ లో ప్రజల ఇబ్బందులు…
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలో గత మూడు రోజులుగా ఎండు తీవ్రత పెరిగి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. డివిజన్ లో 36 నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు పెరిగిన ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఉక్కపోతకు గురవుతూ ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. విద్యుత్ వినియోగం కూడా పెరగడంతో కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు అన్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలతో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
![]()
