Connect with us

Andhra

మార్కాపురం డివిజన్ వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘అన్నదాత పోరు’.. సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన నేతలు..

Published

on

మార్కాపురం: రైతాంగానికి అత్యంత ప్రధాన ఎరువుల్లో ఒకటయిన యూరియా కొరతతో రాష్ట్రంలోని రైతులు సతమతమవుతున్నారని, అన్నదాతల ఆందోళనను ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా మొద్దు నిద్రతో ఉందని వైఎస్సార్సీపీ ఎమ్యెల్యే తాడిపత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కె.పి.నాగార్జున రెడ్డిలు కూటమి ప్రభుత్వంపై దుయ్యబట్టారు.

మార్కాపురం డివిజన్ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ పై నిరసనగా మార్కాపురం పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

ముందుగా గడియార స్తంబం సెంటర్ నందు ఉన్న వైయస్సార్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కోర్ట్ సెంటర్ నందు ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయంకు వచ్చారు. అయితే పోలీసులు నిబంధనలు విధించి కొంతమందికి మాత్రమే సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. యూరియా కొరతను, రైతుల బాధలను, సమస్యలను పరిష్కరించకుండా, సమస్య లేదని అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రి, మంత్రులకు రివాజుగా మారిందన్నారు. ఇకనైనా సమస్యను పరిష్కరించకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సబ్ కలెక్టర్ సెహదిత్ వెంకట త్రివినాగ్ కు వినతిపత్రం సమర్పించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.