Connect with us

Andhra

ప్రమాద బీమా చెక్కును అందజేసిన బాలినేని ప్రణీత్ రెడ్డి, ఇమ్మడి కాశీనాథ్..

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం నందు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన జనసేన క్రియాశీలక సభ్యులు ఐతా గురునాథం కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరుపున జనసేన పార్టీ నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి మరియు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ చేతుల మీదుగా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేయడం జరిగింది. అలాగే ఇమ్మడి కాశీనాథ్ జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటి సీయం పవన్ కళ్యాణ్ పంపించిన సందేశాన్ని ఐతా గురునాథం కుటుంబ సభ్యులకు చదివి వినిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జడా బాల నాగేంద్ర, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, సంతనూతలపాడు ఇంచార్జ్ కందుకూరి బాబు, గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ సాయి బాబు, దర్శి నియోజకవర్గ నాయకులు పాపారావు, అద్దంకి నియోజకవర్గ నాయకులు గోరంట్ల సాయి, ఎమ్ ఎన్ రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.