Andhra
2026-27 కల్ల మెడికల్ కాలేజీని PPP పద్దతిలో పూర్తి చేస్తాం.. మంత్రి డోలా
మార్కాపురం: రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ శివారు రాయవరం గ్రామంలో ఉన్న మార్కాపురం మెడికల్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ నిర్మాణం ఎంతవరకు వచ్చిందో పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి వారు మార్కాపురం మెడికల్ కాలేజీ పై పచ్చి అబద్ధాలు ప్రసారం చేస్తున్నారని, వైసీపీ మీడియాలో మెడికల్ కాలేజీ 80% పూర్తయిందని పచ్చి అబద్ధాలు మాట్లాడటం సహేతుకం కాదని, వాస్తవానికి మెడికల్ కాలేజీ నిర్మాణం 18 శాతం మాత్రమే పూర్తయిందని అన్నారు. త్వరలోనే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, అరకు మెడికల్ కాలేజీలను 2026-27వ సంవత్సరంలో పూర్తి చేస్తామని అన్నారు. దీనిపైన క్యాబినెట్లో కూడా చర్చించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
![]()
