Andhra
స్నేహితుడే బ్రహ్మయ్య హత్య చేశాడు.. డిఎస్పీ నాగరాజు
బేస్తవారిపేట: ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో వైసిపి కార్యకర్త బ్రహ్మయ్య హత్య కేసు రాజకీయ పరంగా జిల్లాలో సంచలనం సృష్టించింది. పోలీసులు చాలా త్వరగా ఈ కేసును దర్యాప్తు చేపట్టి, వాటి వివరాలను మార్కాపురం డిఎస్పీ యు నాగరాజు వెల్లడించారు. బ్రహ్మయ్య, రవి లు స్నేహితులని, రవి ఓ అమ్మాయిని ఇష్టపడడంతో బ్రహ్మయ్య ఆ అమ్మాయి కుటుంబానికి రవి గురించి చెడుగా చెప్పినందున వాళ్ల బంధం విడిపోవడంతో బ్రహ్మయ్యపై కక్ష పెంచుకున్నాడని, అది మనసులో ఉంచుకుని రవి పథకం ప్రకారం గతంలో తన దగ్గర పనిచేసిన ఇద్దరు మైనర్లతో కలిసి బ్రహ్మయ్యను కత్తితో పొడిచి చంపారన్నారు. ఆ తర్వాత అనంతరం సాక్ష్యాధారాలు దొరక్కుండా పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ఆయన వివరించారు.
![]()
