Andhra
మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చెయ్యోద్దని సిపియం ఆధ్వర్యంలో ధర్నా..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్యశాలను 4 పి విధానంలో గాకుండా ప్రభుత్వ పరిధిలోనే కొనసాగేటట్లు చూడాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నేడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. అనంతరం మెడికల్ కళాశాల సంభందించిన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పార్టీ నాయకులు సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటీయు జిల్లా కార్యదర్శి డి కె ఎం రఫీ, నాయకులు రూబెన్, రాజు, జబ్బార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
![]()
