Andhra
యూరియా పక్కదారి పట్టడాన్ని అరికట్టండి.. సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు
మార్కాపురం: యూరియా అక్రమ నిల్వలను నివారించి, రైతులకు సరిపడా ఎరువులను అందించాలని కోరుతూ సిపిఐ, కాంగ్రెస్ పార్టీ ల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు అందే నాసరయ్య, నియోజకవర్గ పార్టీ కార్యదర్శి ఎస్ కె కాసిం, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కార్యదర్శి మహబూబ్ వలీ, జిల్లా మహిళా అధ్యక్షురాలు రెహానా భాను, పట్టణ అధ్యక్షుడు ఇమ్రాన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
![]()
