Andhra
అన్నదాత పోరుకు తరలిరండి, పోస్టర్ ఆవిష్కరణ.. అన్నా రాంబాబు
మార్కాపురం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల 9 తేదీ ఉదయం 10 గంటలకు ప్రకాశం జిల్లా మార్కాపురం గడియార స్తంభం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు జరుగు ‘అన్నదాత పోరు’ ని విజయవంతం చేయాలని రైతులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. ముందుగా అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం అన్నా రాంబాబు మాట్లాడుతూ.. రైతులు వారి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక, పంట నష్టపరిహారం అందక తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఈ సమయంలో కూటమి ప్రభుత్వం కనీసం యూరియాను కూడా సరఫరా చేయలేని పరిస్థితుల్లో ఉందని, రైతు కష్టాల్లో ఉంటే యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలించి దళారులు లబ్ది పొందుతున్నారని అన్నారు.
![]()
