Andhra
ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికులకు పాట్లు
మార్కాపురం; ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు అంతంత మాత్రమే. వాటికి ఒకటికి వెయ్యిమంది పోటీ పడవలసిన పరిస్థితి. నేడు ఒంగోలులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షలకు హాజరయ్యేందుకు అభ్యర్థులు తెల్లవారుజామున 4-00 గంటల నుంచే బస్టాండ్ లో వెయిట్ చెయ్యవలసిన పరిస్థితి. ఒంగోలులో నిర్వహించే ఈ పరిక్షలకు పశ్చిమ ప్రకాశం ప్రాంతం నుంచి వందల సంఖ్యలో నిరుద్యోగులు హాజరు. పరిక్షలు ఉదయం 9-00గా ఉండటంతో 8-30కు చేరవలసిన పరిస్థితి. మొదటి బస్సు మార్కాపురం నుంచి 5-00 గంటలకు ఉండటంతో నిరుద్యోగులు మార్కాపురం బస్టాండ్ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వీరికి అవసరం మేరకు కావలసిన బస్సు సర్వీసులు కేటాయించక పోవడంతో, ప్రైవేటు వాహనాలకు గిరాకీ పెరిగింది. శ్రీ శక్తి పధకంలో భాగంగా స్త్రీలకు ఉచితం కావడంతో రెండున్నర గంటలకు చేరవలసిన ఆర్టీసీ బస్సులు, కండక్టర్ లేకుండా డ్రైవర్ ఒక్కరే ఉండటంతో గంట ఆలస్యంగా నడుస్తుంటంతో, ప్రయాణికులకు విసుగు పుడుతున్న పరిస్థితి. ఒక వైపు నిరుద్యోగం మరోవైపు ప్రయాణ భారం ఖర్చులకు నిరుద్యోగులు బెంబేలెత్తుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులు పెంచడమే కాకుండా, సిబ్బందినీ పెంచి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
![]()
