Andhra
ప్రశాంతంగా ముగిసిన వినాయక చవితి నిమజ్జనాలు..చివరి రోజు డిజే సౌండ్ తో దద్దరిల్లిన పట్టణం..
మార్కాపురం: వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పట్టణ సీఐ పి సుబ్బారావు నేతృత్వంలో ఎస్ఐలు ఎమ్ సైదుబాబు, డాక్టర్ రాజమోహన్ రావుల పర్యవేక్షణ లో పోలీసు సిబ్బంది ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా, సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రశాంతంగా పర్యవేక్షించారు. పోలిసుల కృషితో వందలాది వినాయక విగ్రహాలు నిమజ్జనం చేశారు. కొన్ని విగ్రహాలు శనివారం రాత్రి నిమజ్జనానికి తరలి వెళ్లాయి. అయితే మొదటి నుంచి చెప్పినట్లు ముసలివారికి, పిల్లలకు ఇబ్బందుల వస్తాయని డీజే సౌండ్ సిస్టమ్ పెట్ట వద్దని నిర్వాహకులకు చెప్పడంతో అలాగే సాఫిగా సాగింది. చివరి రోజు శనివారం నిర్వాహకులు చాలా చోట్ల డీజే సౌండ్ సిస్టమ్ ద్వారా ప్రజలకు ఇబ్బంది కల్గించడం గమనార్హం. మొత్తం మీద పోలీసులు సమన్వయంతో వినాయక చవితి నవరాత్రులు విజయవంతం చేయడంలో సఫలీకృతం అయ్యారు. దీంతో గత పదకొండు రోజులుగా పోలీసులు చేసిన కృషికి ప్రజలు అభినందనలు తెలియజేశారు.
![]()
