Andhra
రైల్వే బ్రిడ్జి రేలింగ్ ను ఢీకొన్న ట్రక్కు.. తప్పిన పెనుప్రమాదం
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం రైల్వే బ్రిడ్జిపై ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి. నేడు ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఓ టిప్పర్ బ్రిడ్జిపై ఉన్న సైడ్ రైలింగ్ ను ఢీకొంది. దీంతో టిప్పర్ గాల్లో వెలాడింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం మరియు నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. గ్రామీణ పోలీసులు పర్యవేక్షించి, రోడ్డు మార్గం క్లియరెన్స్ చేయడానికి పూనుకున్నారు.
![]()
