Andhra
గురువుకి ఘనంగా సన్మానించిన పూర్వపు విద్యార్థులు..
మార్కాపురం: విద్య నేర్పిన గురువుకి మర్చిపోకుండా ఘనంగా సన్మానించిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటుచేసుకుంది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న వారిలో ప్రస్తుతం తర్లుపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ లో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న సుధాకర్ సార్ కి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నందుకు పూర్వపు విద్యార్థులైన ఉత్తమ్ కుమార్, పోలిరెడ్డి, జాబిర్ లు గురువైన సుధాకర్ సార్ ని కలిసి వారి సంతోషాన్ని వ్యక్తంచేస్తూ.. అభినందనలు తెలియజేశారు. అనంతరం ఘనంగా సన్మానించారు.
![]()
