Andhra
హత్యకు గురైన వైసిపి కార్యకర్త బ్రహ్మయ్యకు నివాళి అర్పించిన జిల్లా అద్యక్షులు బూచెపల్లి, మాజి ఎమ్మెల్యే కే పిలు..
కంభం: ప్రకాశం జిల్లా కంభం మండలం దర్గా గ్రామ వాసి వైసీపీ కార్యకర్త గాలి బ్రహ్మయ్య గురువారం అనుమనాస్పదంగా మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ మరియు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డిలు శుక్రవారం కంభం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూములో ఉన్నా మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ.. గాలి బ్రహ్మయ్య కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారి వెంట పలువురు కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు వైసిపి నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
![]()
