Andhra
కనిగిరి లో రేషన్ బియ్యం పట్టివేత..
కనిగిరి: ప్రకాశం జిల్లా కనిగిరిలో 15వ నంబరు రేషన్ దుకాణం నుంచి 8 బస్తాల అక్రమ రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఆటోలో బియ్యాన్ని తరలిస్తుండగా స్థానిక సిపిఎం నాయకులు అడ్డుకొని సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. డీలర్ అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించి అతనిపై చర్యలకు ఉపక్రమించారు. రేషన్ డీలర్ పై 6ఏ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
![]()
