Andhra
ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ వారి ఆశయాల కోసం పనిచేయాలి: సీఎం చంద్రబాబు
‘మిలాద్ ఉన్ నబీ’ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు నా శుభాకాంక్షలు అని సీఎం చంద్రబాబు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.అజ్ఞానాన్ని పారద్రోలి అశేష ప్రజానీకంలో విశ్వాసం నింపిన మహమ్మద్ ప్రవక్త జన్మదినానికి గుర్తుగా నిర్వహించుకునే మిలాద్ ఉన్ నబీ ముస్లిం సోదరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీతి, నిజాయితీ, ప్రేమ, త్యాగం లాంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ జీవితం కొనసాగించిన ముహమ్మద్ ప్రవక్త ప్రవచించిన సూత్రాలను పాటించేందుకు ప్రేరణ కల్పించేది ‘మిలాద్ ఉన్ నబీ’. సాటి వారిని గౌరవిస్తూ, వారి ఆకలి తీర్చే పవిత్ర ఆశయాలు కొనసాగాలి. అందుకు ముస్లిం సోదరులు ముందు వరుసలో ఉండాలని ఆకాంక్షిస్తూ మరొక్కమారు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
![]()
