Connect with us

Andhra

ప్రసిద్ధ కవి, ఉపాధ్యాయుడు కరీముల్లాకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు..

Published

on

పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ప్రసిద్ధ కవి కరీముల్లాకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా ఈ అవార్డును, సత్కారాన్ని పొందనున్నారు. సెప్టెంబర్ 5 న నర్సరావుపేటలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు డియివో యల్. చంద్రకళ, మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ జివి ఆంజనేయులు, జిల్లా పరిషత్ ఛైర్మన్ హెన్రీ క్రిస్టినా, యంపి లావు కృష్ణదేవరాయలు తదితరులు పాల్గొననున్నారు. కరీముల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లా వినుకొండ మండలంలోని నాగులవరం ఆదర్శ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. విద్యాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. విద్యార్థులు, ప్రజల దృష్టిలో ఆదర్శ ఉపాధ్యాయునిగా నిలిచారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.