Andhra
స్త్రీ శక్తి పధకం అమలుకు మహిళలతో విజయోత్సవం.. ఎమ్మెల్యే కందుల
మార్కాపురం: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పధకాలలో ఒకటైన స్త్రీ శక్తి పథకం.. మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఆగష్టు 15 ప్రారంభించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాయుడు వీధిలో మహిళలలతో కలిసి నృత్యం చేస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరచిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సులలో ఉచితంగా ప్రయాణించేందుకు సౌకర్యం కల్పించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మహిళా నాయకులు పాల్గొన్నారు.
![]()
