Connect with us

Andhra

రాహుల్ గాంధీ గడ్డి బొమ్మని దగ్ధం చేసిన బిజేపి నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి.. షేక్ సైదా

Published

on

ఒంగోలు: సెప్టెంబర్ ఒకటవ తేదీన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన ఒంగోలు పట్టణంలోని కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధి గడ్డి బొమ్మను పెట్రోలు పోసి దగ్ధం చేసి, కాళ్లతో తన్నుతూ హేయంగా ప్రవర్తించిన బిజెపి నాయకులపై కేసు నమోదు చేయాలని కోరుతూ నేడు ‌ ఒంగోల్ వన్ టౌన్ సిఐ నాగరాజు గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ.. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఒక క్యాబినెట్ మంత్రి హోదా కలిగిన కాంగ్రెస్ అధినేత, దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు రాహుల్ గాంధీ గడ్డిబొమ్మను కాలుస్తూ కాళ్లతో తొక్కుతూ ఇలాంటి అగత్యానికి పాల్పడిన బిజెపి నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అలాగే బీహార్ లో జరుగుతున్న ‘ఓట్ చోరీ’ నిరసనలు విజయవంతం కావడంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఆప్రతిష్ట పాలం చేసెందుకు బిజేపి నేతలు ఇలాంటి దుర్మార్గమైన కార్యాచరణ చేయడం సిగ్గు చేటని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ రసూల్, గోరంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర కార్మిక కర్షక కాంగ్రెస్ అధ్యక్షులు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి, రాష్ట్ర మైనార్టీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ అహ్మద్, కేకేసి రాష్ట్ర కార్యదర్శి సుధీర్ వర్మ, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ మన్నం ప్రసన్నరాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సుదర్శి రవి తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.