Connect with us

Andhra

రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా సయ్యద్ సాదిక్..

Published

on

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కమిటీని 15 మందితో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిటీలో స్టేట్ డైరెక్టర్ గా జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాదిక్ ను నియమించారు‌. సయ్యద్ సాదిక్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఉద్భవించినప్పటి నుంచి పార్టీకి నమ్మకస్తుడుగా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం తర్వాత పవణ్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ప్రారంభించినప్పటి నుండి పూర్తి జన సైనికుడుగా, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా పార్టీని వీడకుండా జనసేనాని వెంటే ఉన్నారు. పార్టీకి విధేయతగా ఉండటం వలన రాష్ట్ర పదవి వరించింది. ఈ సందర్భంగా సయ్యద్ సాదిక్ మాట్లాడుతూ.. నాకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా పదవి ఇచ్చిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, మరియు ఇందుకు సహకరించిన జనసేన ప్రకాశం జిల్లా అద్యక్షులు షేక్ రియాజ్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మొఘల్ జావీద్ బేగ్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు‌. అలాగే పార్టీ అభివృద్ధికి తన వంతుగా శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.