Andhra
రాహుల్ గాంధీ చిత్రపటాన్ని కాల్చిన బిజేపి నాయకులపై కేసులు నమోదు చెయ్యాలని సీఐ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ ..
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చిత్రపటాలను కాల్చిన బిజేపి నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మార్కాపురం పట్టణ సిఐ పి సుబ్బారావుకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈసందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ మహబూబ్ వలి మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు షేక్ రిహానా బానులు మాట్లాడుతూ.. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడికి భారత రాజ్యాంగం కల్పించిన క్యాబినెట్ మంత్రి హోదా కలిగిన రాహుల్ గాంధీ చిత్రపటాన్ని కాల్చి, కాళ్లతో తొక్కుతూ.. చట్టవిరుద్ధంగా, నీచ సంస్కృతికి పాల్పడిన బిజెపి నాయకులపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఓట్ చోరీ ర్యాలీలో పాల్గొన్న ఒక నాయకుడు అన్న మాటలను రాహుల్ గాంధీకి అంటగట్టి, దేశ ప్రజలలో రాహుల్ గాంధీకి పెరుగుతున్న ప్రతిష్టను తట్టుకోలేక ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పాడుతున్నారని ఎద్దేవాచేశారు.
మార్కాపురం పట్టణం నడిబొడ్డున గడియార స్తంభం సెంటర్, పోలీస్ స్టేషన్ కు ఎదురుగా రాహుల్ గాంధీ చిత్రపటాలను కాల్చిన బిజెపి నాయకులు మార్కాపురం పట్టణ బిజెపి అధ్యక్షులు పాదర్తి ఆంజనేయులు, మార్కాపురం బిజేపి నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణారావు, శాసనాల సరోజినీ, మద్దెల లక్ష్మి, షేక్ షబానా, సతీష్ కుమార్ ప్రవీణ్, శివప్రసాద్, మురళి, రంగారావు, అల్యాకుల సుబ్బారావు తదితరులపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని సిఐకు ఫిర్యాదు ఇచ్చామని, వారు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో తర్లపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ హుస్సేన్, మార్కాపురం పట్టణ అధ్యక్షుడు షేక్ ఇమ్రాన్, షేక్ యూసుఫ్, షేక్ షఫీ, అబూబకర్ సిద్ధిక్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
![]()
