Connect with us

Andhra

TNSF ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధిగా డి నాసరయ్య..

Published

on

  1. ప్రకాశం జిల్లా తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టి ఎన్ ఎస్ ఎఫ్) అధికార ప్రతినిధిగా 32 వార్డు దూదేకుల నాసరయ్యని నియమించిన తెలుగు దేశం పార్టీ. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకులకు టిడిపి గుర్తింపు ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున్, టిడిపి నియోజకవర్గ నాయకులు కందుల వేణు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దూదేకుల నాసరయ్య మాట్లాడుతూ.. నామీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు, ఒంగోలు యంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లా మంత్రులు డోలా వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ది కోసం అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దూదేకుల నాసరయ్య కు ఈ పదవి వచ్చినందుకు స్నేహితులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.