Connect with us

Andhra

సాదిక్ ఆద్వర్యంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం..

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రభుత్వ BC కళాశాల బాలుర హాస్టల్ నందు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బిసి హాస్టల్ వార్డెన్ మాకం కాశయ్య సమక్షంలో కళాశాల విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందించారు. తదనంతరం విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు పేరూరి రమేష్, షేక్ కాశింవలి (సోను), బి కొండల్ ప్రజాపతి, డి కాశిం, నిశనం పాపయ్య, దుమ్మని చందు, యమ్మని శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.