Andhra
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైయస్సార్.. మాజీ ఎమ్మెల్యే అన్నా
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంబం సెంటర వద్ద వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల హృదయాల్లో ఆయన సముపార్జించిన కీర్తి, ప్రతిష్టలు ఎప్పటికీ చిరస్మరణీయంగా వుంటాయని, అలాగే ఆయన రాష్ట్రానికి అందించిన సుపరిపాలన, సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడు వారి హృదయాల్లొ నిలుపుకుంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
