Connect with us

Andhra

ఎడాపెడా విద్యుత్ కోతలతో మార్కాపురం పట్టణవాసుల ఇబ్బందులు..

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కరెంట్ కోతలు విధించి పట్టణ వాసులకు ఇబ్బందులు గురిచేస్తున్న విద్యుత్ అధికారులు. ప్రతి శనివారం మరమ్మతుల పేరిట కోతలు విధించడం అనవాయితీ.. ఈ మధ్య కాలంలో ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా కోతలు విధిస్తుండటంతో పట్టణ వాసులు చాలా అసౌకర్యానికి గురౌతున్నారు. పైగా విషయం తెలుసుకోవాలంటే విద్యుత్ ఉన్నతాధికారుల ఫోన్లు పనిచేయడం లేదని పట్టణ ప్రజలు ఆవేదనా వ్యక్తం చేస్తున్నారు. ఈ కోతలతో రోజువారీ కూలీలు, విద్యుత్ పై ఆధారపడి పనిచేస్తున్న కార్మికులకు మరీ ఇబ్బంది కారంగా మారుతుంది. ముందస్తు సమాచారం, వారానికి ఒకరోజు మరమ్మతులు చేసి, విద్యుత్ సరఫరాలో ఎటువంటి అసౌకర్యానికి గురి చేయకుండా విద్యుత్ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.