Connect with us

Andhra

ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైయస్సార్.. కాంగ్రెస్ నాయకులు మహబూబ్ వలి

Published

on

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త షేక్ సైదా ఆదేశాల మేరకు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఉన్న వైయస్ఆర్ విగ్రహానీకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా సందర్భంగా జిల్లా మైనారిటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మహబూబ్ వలీ మాట్లాడుతూ.. వైయస్ఆర్ అంటే మనకు గుర్తు వచ్చేది ప్రజలకు ఆయన చేసిన సంక్షేమ పధకాలని, ముఖ్యంగా 108, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముస్లింలకు మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ముఖ్యమైనవని, మార్కాపురం పట్టణంలోని ముస్లింల కోసం షాది ఖానా నిర్మాణానికి స్థలాన్ని వైఎస్ఆర్ కేటాయించి 20 సంవత్సరాలు అయినా గత, నేటి పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమానికి పట్టణ కాంగ్రెస్ పార్ట అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్ అధ్యక్షత వహించగా, తర్లపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ హుస్సేన్, షేక్ యూసుఫ్, షేక్ ఇమ్రాన్, సయ్యద్ ముజీబ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.