Connect with us

Andhra

ప్రెస్ అకాడమీ మరియు ఏపియూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ తరగతులు విజయవంతం..NV రమణ

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో జర్నలిస్టులకు రాష్ట్ర ప్రెస్ అకాడమీ మరియు ఏపియూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమం మొదటి రోజు సౌజన్య ఫంక్షన్ హాల్ లో, రెండవ రోజు మార్కాపురం ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, ఏపియూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు జర్నలిస్టులకు పలు విలువైన సూచనలు చేశారు. ఏపియూడబ్ల్యూజే జిల్లా అద్యక్షులు ఎన్వీ రమణ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో పలు సీనియర్ జర్నలిస్టులు తరగతులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ దాస్, స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, రాష్ట్ర మైనారిటీ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్.. A1 గ్లోబల్ చైర్మన్ మీర్జా షంషీర్ అలీబేగ్, జిల్లాలోని పలువురు రాజకీయ నేతలు మరియు మార్కాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, జిల్లా లోని పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమం విజయవంతం కావడం పట్ల ఏపియూడబ్ల్యూజే జిల్లా అద్యక్షులు ఎన్వీ రమణ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.