Connect with us

Andhra

పేద అమ్మాయి పెళ్లికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహబూబ్ వలి వితరణ..

Published

on

ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త షేక్ సైదా పిలుపుమేరకు మార్కాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ నాయకత్వంలో మార్కాపురం పట్టణంలోని పట్టణ కమిటీల ఏర్పాటులో భాగంగా పదో వార్డు పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా మీనా మసీదు ప్రాంతంలో షేక్ ఇస్మాయిల్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా బాధపడుతూ మంచానికి పరిమితమైన పరిస్థితిని చూసి చలించి, వీరి యొక్క కుమార్తె పెళ్లి అవసరాలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి మరియు పెద్దారవీడు త్రిపురాంతకం మండలాల పరిశీలకులు డాక్టర్ షేక్ మహబూబ్ వలి 5 వేల రూపాయలు చెక్కు రూపంలో తన వంతు సహాయంగా షేక్ ఇస్మాయిల్ భార్య షేక్ హబీబాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, కాంగ్రెస్ పార్టీ తర్లుపాడు మండల అధ్యక్షుడు షేక్ హుస్సేన్ లు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహబూబ్ వలి చేసిన ఆర్థిక సహాయానికి ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.