Andhra
త్రిపురాంతకంలో భారీ నాగుపాము..
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపిలో 6 అడుగుల పెద్ద నాగు పాము కలకలం రేపింది. సుధీర్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో పాము కనిపించడంతో భయబ్రాంతులకు గురై వెంటనే ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ మల్లికార్జున కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఆ పామును చాకచక్యంగా గోనె సంచిలో బంధించి సురక్షితంగా నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పాములు కనిపిస్తే చంపకుండా సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
![]()
