Andhra
నాటు బాంబు పేలి కుక్క మృతి..
మార్కాపురం: నాటు బాంబు పేలడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రజలు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం లోని గోగుల దీన్నే, (కందివారిపల్లి) లో నాటు బాంబు కలకలం రేగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో కుక్క నాటు బాంబును నోటితో పట్టుకొని తిరుగు తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలి కుక్క తల చిధ్రమై పగిలి చనిపోయింది. ఒక్కసారిగా కాలనీలో నాటుబాంబు పేలడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో నాటు బాంబు ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో మార్కాపురం గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![]()
