Andhra
నేడు హోప్ విన్ హాస్పిటల్ 5వ వార్షికోత్సవం సందర్భంగా మదర్సా పిల్లలకు ఉచిత HPV టీకాలు
స్థాపించిన అతికొద్ది సంవత్సరాలలోనే విస్తృత ప్రజాదరణ పొందిన హోప్ విన్ హాస్పిటల్ నేడు ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఈ 5వ వార్షికోత్సవం సందర్భంగా హాస్పిటల్ ఆధ్వర్యంలో మదర్సా పిల్లలకు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమ సుల్తానా స్వయంగా ఉచిత HPV టీకాలు వేశారు.వారి కుమార్తె ఎర్మినా కూడా తన పుట్టినరోజు సందర్భంగా HPV టీకాను తీసుకుంది. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఈ టీకాను వేయించుకోవాలని 9-14 సంవత్సరాల వయస్సు గల బాలురు మరియు బాలికలందరికీ అని ఎర్మినా సందేశం ఇచ్చింది.ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నజీరుద్దీన్ – డాక్టర్ షమ సుల్తానా మాట్లాడుతూ తమ హాస్పిటల్ ను ఇంతగా ఆదరిస్తున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దేవుని ఆశీస్సులతో హాస్పిటల్ తరుపున పేద ప్రజలకు సేవలు కొనసాగిస్తామని అన్నారు.
![]()
