Connect with us

Andhra

క్రీడా వికాస కేంద్రంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు..

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం క్రీడా వికాస కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టేడియం ఇంఛార్జ్ సయ్యద్ మయూరి ఖాసిం  అధ్యక్షత వహించారు. భారత హాకీ క్రీడాకారుడు, భారత క్రీడా చరిత్రలో అమరుడైన ‘మేజర్ ధ్యాన్‌చంద్” జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఖాసిం మాట్లాడుతూ.. మేజర్ ధ్యాన్‌చంద్ దేశానికి అపార గౌరవాన్ని తీసుకొచ్చారని, ఆయన సాధించిన విజయాలు ప్రతి క్రీడాకారుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. క్రీడా ప్రస్థానంలో క్రమశిక్షణ, కృషి, నిబద్ధత కలిగినప్పుడే విజయాలు సాధ్యమవుతాయని, ప్రతి ఒక్క క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ మార్గంలో నడుస్తూ గొప్ప క్రీడాకారులుగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కోచ్‌లు, క్రీడాకారులు, స్థానిక క్రీడాభిమానులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.