Andhra
సీజనల్ వ్యాధులు .. డాక్టర్ షమ సుల్తానా సూచనలు
వర్షాకాలంలో ఏకధాటిగా కురిసే వర్షాల వల్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని కాబట్టి గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ షమ సుల్తానా తెలిపారు. ‘మిగతా కాలాలతో పోల్చుకుంటే వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత అవసరం. కాచి చల్లార్చిన నీరు తాగాలి. పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలి. రాత్రి సమయాల్లో దోమతెరలు వాడాలి. 24 గంటల్లో జ్వరం తగ్గకపోతే డాక్టర్ను సంప్రదించాలి’ అని డాక్టర్ షమ సుల్తానా సూచించారు. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె తెలిపారు.
![]()
